పవన్‌ సినిమాలు స్వస్తి




http://telugu.greatandhra.com/movies/movie-gossip/pawan-ki-inka-moodu-ellu-53294.html

పవన్‌కళ్యాణ్‌ మరో మూడేళ్ల పాటు మాత్రమే సినిమాలు చేయాలని డిసైడ్‌ అయ్యాడు. ఈ మూడేళ్లలో ఎన్ని 

సినిమాలు చేయగలడో చేసేసి ఆ తర్వాత పూర్తి సమయం రాజకీయాలకి కేటాయించబోతున్నాడు. అందుకే ఈ 

మూడేళ్లలో అన్నీ వేగంగా పూర్తయ్యే సినిమాల్నే చేయాలని పవన్‌ నిర్ణయించుకున్నాడు. అయిదారు సినిమాలైనా 

ఈ టైమ్‌లో పూర్తి చేయాలనేది టార్గెట్‌ అట.  వచ్చే వేసవిలోగా గోపాలా గోపాలాతో పాటు గబ్బర్‌సింగ్‌ 2 షూటింగ్‌ని 

కూడా పూర్తి చేసేయనున్న పవన్‌ ఆ తర్వాత కూడా రెండు సినిమాలు ఒకేసారి మొదలు పెడతాడట. తదుపరి 

ఎన్నికలకి సన్నద్ధం కావడానికి తగినంత సమయం తనకి ఉండాలి కనుక ఎన్నికలకి రెండేళ్లు ముందుగానే పవన్‌ 

నటనకి స్వస్తి చెప్పనున్నాడు.  సినిమాలనుంచి పూర్తి స్థాయి రిటైర్మెంట్‌ తీసుకుని ఇక మళ్లీ కెమెరా ముందుకి 

రాకుండా ఉండేట్టు పవన్‌ ప్లాన్‌ చేసుకుంటున్నాడు. కాబట్టి పవన్‌ నటించే ఈ చివరి అయిదారు సినిమాల్ని 

అభిమానులు కరువు తీరా చూసేసుకోవాలి. అటుపై పవన్‌ని రాజకీయ వేదికలపై తప్ప వెండితెరపై వీక్షించే ఛాన్స్‌ 

ఉండదుగా మరి!  - 

0 comments: