పవన్ కు 50 కోట్లు






పవన్ కు 50 కోట్ల పారితోషికాన్ని ఇవ్వడానికి సిద్ద పడుతున్నట్లుగా టాక్ ఈ వార్తలే నిజం అయితే దక్షిణాది సినిమాలలో 
రజినీకాంత్ పారితోషికాన్ని మించి అందుకున్న టాప్ హీరోగా పవన్ రికార్డులు క్రియేట్ చేస్తాడు.హాట్ న్యూస్ గా మారిన పవన్ 50 
కోట్లు!నిన్న పవన్ వెంకటేష్ తో కలిసి ‘ఓమై గాడ్’ తెలుగు రీమేక్ కోసం కెమెరా ముందుకు రావడంతో దాదాపు పది నెలల 
తరువాత పవన్ సినిమాలకు సంబంధించిన వార్తలు మళ్ళీ అధికారికంగా రావడం మొదలు అయ్యాయి. మరో మూడు 
సంవత్సరాలలో పవన్ నటనకు స్వస్తి చెపుతాడు అని వార్తలు వస్తున్న నేపధ్యంలో ప్రస్తుతం పవన్ నటిస్తున్న ‘ఓమై గాడ్’, 
‘గబ్బర్ సింగ్-2’ సినిమాలు కాకుండా పవన్ రానున్న రోజులలో మరెన్ని సినిమాలలో నటిస్తాడు అనే వార్తలు ఫిలింనగర్ లో 
హడావిడి చేస్తున్నాయి. ఈ వార్తల నేపధ్యంలో రాబోతున్న మూడు సంవత్సరాలలో పవన్ కాల్ షీట్స్ కోసం అప్పుడే టాలీవుడ్ 
నిర్మాతలలో తీవ్రమైన పోటీ ఏర్పడినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.సమాచారం ప్రకారం ఒక బహుళ జాతి సినిమా నిర్మాణ 
సంస్థ తాము ఒక ప్రముఖ దర్శకుడితో వచ్చే సంవత్సరం నిర్మించబోయే సినిమాలో పవన్ నటించడానికి అంగీకరిస్తే పవన్ కు 
50 కోట్ల పారితోషికాన్ని ఇవ్వడానికి సిద్ద పడుతున్నట్లుగా టాక్ ఈ వార్తలే నిజం అయితే దక్షిణాది సినిమాలలో రజినీకాంత్ 
పారితోషికాన్ని మించి అందుకున్న టాప్ హీరోగా పవన్ రికార్డులు క్రియేట్ చేస్తాడు. అయితే పారితోషికం విషయంలో ఎప్పుడూ 
అంతగా శ్రద్ద పట్టని పవన్ ఇక తన కెరియర్ మరి కొద్ది సంవత్సరాలలో ముగింపుకు వస్తోంది కాబట్టి ఈ ఆఫర్లను అంగీకరించి 
పవన్ తెలుగు సినిమా రంగంలోనే కాదు దక్షిణాది సినిమా రంగంలో కూడా ఎవరు అందుకోని శిఖరాలు అందుకుంటాడా లేదా 
అనే విషయం మరికొద్ది నెలలలో తేలిపోతుంది అని అంటున్నారు ఫిలింనగర్ విశ్లేషకులు.

0 comments: