విశ్వ విఖ్యాత నట చక్రవర్తి

                             విశ్వ విఖ్యాత నట చక్రవర్తి




                                 విశ్వ విఖ్యాత నట చక్రవర్తి ,ఈ పేరు చాలు తెలుగు సినిమా అభిమానే కాదు యావత్ భారతీయ సినిమా అభిమాని పులకిరంచడానికి ,అటువంటి నటుడు  s.v.r పూర్తి పేరు సామర్ల వెంకట రంగారావు . 1918 july 3 న కృష్ణ జిల్లా నూజివీడు లో పుట్టారు .లక్ష్మీ నరసాయమ్మ, కోటీశ్వరనాయుడులకు ఎస్వీ రంగారావు జన్మించాడు.నట యశస్వి గా పేరు పొందిన ఈ నటుడు మూడు దశాబ్దాలపాటు మూడొందల  చిత్రాలకు పైగా అద్భుతంగా నటించి ఘటోత్కచుడిగా, కీచకుడిగా, రావణాసురుడిగా తనకు తానే సాటిగా ఖ్యాతి గడించాడు. ఆయా పాత్రలలో ఆయన ఎంత మమేకమై పొయ్యరంటే, వేరెవరు కూడా ఆ పాత్రలలో ఇప్పటివరకు ఇమడ లేకపొయ్యారు.
                      

                          తండ్రి ఎక్సైజు శాఖలో పనిచేసేవాడు. యస్.వి.రంగారావు హిందూ కాలేజిలో చదివాడు. 
డిగ్రీ వరకూ చదివి, అగ్నిమాపక దళంలో ఉన్నతోద్యోగిగా పనిచేస్తూ, షేక్స్‌పియర్ ఆంగ్ల నాటకాలలో ఒథెల్లో, 
షైలాక్ తదితర పాత్రలు పోషించి ప్రముఖ రంగస్థల కళాకారుడిగా విశేష ఖ్యాతి గడించాడు. ఆ తర్వాత 
బి.వి.రామానందం దర్శకత్వంలో నిర్మించిన వరూధిని చిత్రంలో ప్రవరాఖ్యుడిగా తెలుగు చలనచిత్ర రంగానికి 
పరిచయమయ్యాడు.

1 హ బానిస,బానిసలకు ఇంత ఆహంభావమా

2 సాహసం చేయార డింబక రాజ కుమారి వరిస్తుంది 
3 దొంగిరి

 డైలాగు ఏదైనా,ఎంత పెద్ద సన్నివేశం ఐన  తన నటనాచాతుర్యంతో  మొత్తం సన్నివేశాని ప్రేక్షకులను కూడా తన వైపు తిప్పుకోగల నటుడు మన S. V. R

             గుమ్మడి గారు కారక్టర్ ఆర్టిస్టుగా స్తిరపడటానికి అసలు అటువంటి మార్గాని ఎంచుకోడానికి రంగా రావు 

గారని ఒక టీవీ ఛానల్ కి ఇచిన ఇంటర్వ్యూ లో చెప్పారు.

                     అసలు తెలుగు నటులలో రంగా రావు గారిది ప్రత్యేకమైన పందా . రంగా రావు గారు చాలామందికి ఒక నటుడుగా మాత్రమే తెలుసు , కానీ ఒక ఉత్తమ దర్శకులు అదే విధంగా అభిరుచి గల నిర్మాత కూడా . 


                                     వరూధిని చిత్రంలో ప్రవరాఖ్యునిగా ఎస్వీ రంగారావు ఆ తర్వాత మనదేశం, పల్లెటూరి పిల్ల , షావుకారు, పాతాళభైరవి, పెళ్ళి చేసి చూడు, బంగారుపాప, బాలనాగమ్మ, గృహలక్ష్మి, బాల భారతం, తాతా మనవడు ఇలా అనేక చిత్రాలలో విభిన్న పాత్రలు పోషించి తన అద్భుత నటనాచాతుర్యంతో సినీ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశాడు.

                                    నటసామ్రాట్, విశ్వనట చక్రవర్తి మొదలగు బిరుదులతో తెలుగు ప్రేక్షకులు ఆయన్ను గౌరవించారు. ఎస్వీయార్ నటించిన నర్తనశాల ఇండొనేషియాలోని జకార్తా లో ఆఫ్రో-ఆసియా అంతర్జాతీయ చిత్రోత్సవము‍లో ప్రదర్శించబడడమే కాకుండా కీచకపాత్రకుగాను ఎస్వీయార్ అప్పటి ఎన్నో చిత్రాల కధానాయకులను వెనుకకు నెట్టి బారతదేశం నుంచి తొలి అంతర్జాతీయ ఉత్తమ నటుడుగా బహుమతి పొందాడు. కొన్ని చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించాడు. ముఖ్యంగా ఆయన దర్శకత్వం వహించిన చదరంగం చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వ బహుమతి, నగదు పారితోషికం లభించాయి.
                                 అద్భుత నటనకు ప్రతీకగా నిల్చిన ఎస్వీ రంగారావు 1974 జూలై 18వ తేదీన మద్రాసు లో శాశ్వతంగా కన్నుమూశాడు.

                                వ్యక్తిగా రంగారావు సహృదయుడు, చమత్కారి. ఆయన ఇష్టదైవం శివుడు. ప్రతిరోజూ శివపూజ చేసిన తర్వాత దినచర్య ప్రారంభించేవాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. కుమార్తెల పేర్లు విజయ, ప్రమీల. కొడుకు పేరు కోటేశ్వర రావు.

                                 యస్వీఆర్ ఒక రకమయిన వేదాంతి. ఆయన ఇంటి లైబ్రరీలో వివేకానందునికి సంబంధించిన పుస్తకాలు ఎన్నో ఉండేవి. ఆయన గొప్ప దాత. ప్రజాహిత సంస్థలకు లెక్కలేనన్ని విరాళాలు ఇచ్చాడు. చైనాతో యుద్ధం వచ్చినపుడు ఏర్పాటు చేసిన సభలో పదివేల రూపాయలు విరాళం ఇచ్చాడు. తర్వాత పాకిస్తాన్‌తో యుద్ధం వచ్చినపుడు కూడా ఎన్నో సభలు నిర్వహించి, మిగతా నటులతో కలసి ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి, విరాళాలు సేకరించి, ఆ డబ్బును రక్షణ నిధికి ఇచ్చాడు.

అవార్డులు, ప్రశంసలు

                             నర్తనశాలలో కీచకుని పాత్రకు ఆఫ్రో-ఆసియా చిత్రోత్సవములో ఉత్తమ నటుని బహుమతి అందుకొన్న ఎస్వీ రంగారావు

బిరుదులు:
విశ్వనటచక్రవర్తి
నటసార్వభౌమ
నటసింహ
బహుమతులు
రంగారావు దర్శకత్వం వహించిన మొదటిచిత్రం ‘చదరంగం’ ద్వితీయ ఉత్తమ చిత్రంగా నంది అవార్డును, రెండవ చిత్రం ‘బాంధవ్యాలు’ తొలి ఉత్తమ చిత్రంగా నంది అవార్డును గెలుచుకున్నాయి.
నర్తనశాల చిత్రంలో నటనకు ఇండోనేషియా ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమ నటుడి అవార్డు, అదే పాత్రకు రాష్ట్రపతి అవార్డు అందుకున్నాడు.
ఎస్.వి.రంగారావు ప్రతిభను గురించి, వైవిధ్యమైన పాత్రల పోషించగల నైపుణ్యం గురించి ప్రసిద్ధ దర్శకుడు చిత్రకారుడు, బాపువేసిన ఛిత్రానికిముళ్ళపూడి వాఖ్యానం ఇలా చమత్కారంగా వ్రాశారు.
క్లిష్టపాత్రల్లో చతురంగారావు
దుష్టపాత్రల్లో క్రూరంగారావు
హడలగొట్టే భయంకరంగారావు
హాయిగొలిపే టింగురంగారావు
రొమాన్సులో పూలరంగారావు
నిర్మాతల కొంగుబంగారావు
స్వభావానికి ‘ఉంగారంగారావు
కథ నిర్బలం అయితే హావభావాలు పాత్రపరంగారావు
కళ్ళక్కట్టినట్టు కనబడేది ఉత్తి యశ్వీరంగారావు
ఆయన శైలీ ఠీవీ అన్యులకు సులభంగారావు
ఒకోసారి డైలాగుల్లో మాత్రం యమకంగారంగారావు.

0 comments: