ఎమ్మెస్ మనమధ్య లేరు
మైలవరపు సూర్య నారాయణ ఆయనే ఎమ్మెస్ నారాయణ ఇకపై తెలుగు సినీ తెరపై ఎమ్మెస్ నవ్వులు
కనిపించవు. కారణం ఆయన ఇక లేరు. ఈ రోజు ఉదయం ఎమ్మెస్ నారాయణ హైద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో
చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.1951 ఏప్రిల్‌లో జన్మించిన ఎమ్మెస్ నారాయణ, కొంతకాలం
లెక్చరర్‌గానూ పనిచేశారు. దాదాపు 700 సినిమాల్లో ఎమ్మెస్ నటించారు. వీటిల్లో కొన్ని ఇంకా రిలీజ్ కావాల్సి
వున్నాయి. ‘పటాస్’ సినిమా నేడు విడుదలయ్యింది. ఇందులోనూ ఎమ్మెస్ కడుపుబ్బా నవ్వించే పాత్రలో
కన్పించారు. తెలుగు సినీ నవ్వుల ప్రపంచానికి ఎమ్మెస్ మరణం తీరని లోటనీ, ఓ కుటుంబ సభ్యుడ్ని
కోల్పోయినంత బాధగా వుందని పలువురు సినీ ప్రముఖులు ఎమ్మెస్ మృతి పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెస్
నారాయణ మృతి చాలా షాకింగ్ గా ఉందని, తట్టుకోలక పోతున్నాని పాటల రచయిత చంద్రబోస్ తెలిపారు. తన
తొలి నాళ్లలో రచయితగా పరిచయం అని ఎమ్మెస్ అద్భుత సంభాషణలు రాశారని గుర్తు చేసుకున్నారు. తనను
ఆప్యాయంగా బోసు.. బోసు అని ఆప్యాయంగా పిలుస్తూ తనను ఎమ్మెస్ కొడుకులా చూసుకునేవారని చంద్రబోస్
చెప్పారు. ఎమ్మెస్ నారాయణ కుటుంబానికి బోస్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
ఎమ్మెస్ నారాయణ భౌతికకాయాన్ని కొండాపూర్ కిమ్స్ ఆస్పత్రి నుంచి ఫిల్మ్‌చాంబర్‌కు
తీసుకువచ్చారు. అభిమానుల సందర్శనార్థం సాయంత్రం 4 గంటల వరకు ఎమ్మెస్ భౌతికకాయాన్ని
ఫిల్మ్‌చాంబర్‌లో ఉంచనున్నారు. రేపు(శనివారం) వికారాబాద్‌లో నారాయణ అంత్యక్రియలు జరుగనున్నాయి.
గజల్ శ్రీనివాస్ ఎమ్మెస్ నారాయణ తన తెలుగు టీచర్ అని, బాల్యం నుంచి క్లాస్ లో తనను
పాటలు పాడించేవారని గజల్ శ్రీనివాస్ తెలిపారు. తనలో ధైర్యాన్ని నింపి ఆనాడు పాటల పోటీల్లో పాడించి
ప్రోత్సహించారన్నారు. ఎమ్మెస్ మంచి నాటక రచయిత, మంచి డైరెక్టర్ అని గుర్తు చేశారు ఆర్ నారాయణ మూర్తి
ఎమ్మెస్ నారాయణ గొప్ప రచయిత, నటుడు అంతే కాకుండా గొప్ప మానవతావాది అని ఆర్ నారాయణ మూర్తి
అన్నారు. ఎమ్మెస్ కోలుకుంటాడని ఆశించానని మూర్తి అన్నారు. ఆయన మృతి సినీ ప్రపంచానికి తీరలని
లోటని నారాయణ మూర్తి పేర్కొన్నారు. కొండవలస ఎంఎస్ నారాయణ మృతి తనకు, తెలుగు చలన చిత్ర
రంగానికి తీరని లోటు అని.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కొండవలస అన్నారు. ఎంఎస్ కుటుంబసభ్యులకు
కొండవలస ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎంఎస్ నారాయణ గురించి మాట్లాడేందుకు తనకు మాటలు రావటం
లేదని కన్నీటిపర్యంతమయ్యారు. అలీ ఎమ్మెస్ నారాయణ మృతి బాధాకరమని ప్రముఖ హాస్యనటుడు అలీ
అన్నారు. తామిద్దరం కలిసి వంద సినిమాలు పైగా కలిసి నటించామని గుర్తు చేసుకున్నారు.ఎమ్మెస్ రచయితగా
వచ్చి, నటుడిగా తన మార్కుని ఏర్పరుచుకున్నారని అలీ తెలిపారు. దూకుడుకు అవార్డు వచ్చినప్పుడు ఎమ్మెస్
సంతోషించారని, ఒక అవార్డు వస్తే నటుడికి సపోర్ట్ గా ఉంటుందని ఆయన అన్నారని అలీ వెల్లడించారు. ఎమ్మెస్
కుటుంబానికి అలీ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
0 comments: