5న వికెండ్‌ లవ్‌


               జర్నలిస్ట్‌ దర్శకుడిగా మారి స్వర్గీయ రియల్‌ స్టార్‌ డాక్టర్‌ శ్రీహరి ముఖ్యపాత్రలో తీసిన సినిమా 
వీకెండ్‌ లవ్‌. ఆదిత్‌ , సుప్రియా శైలజ జంటగా దృష్టి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నాగు గవర దర్శకత్వంలో 
జెర్రిపోతుల ప్రకాష్‌ సహ నిర్మాతగా యువ నిర్మాత మధు తోట  నిర్మిస్తున్న  వీకెండ్‌ లవ్‌ చిత్రం సెన్సార్‌ పూర్తి 
చేసుకుంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 5న విడుదలకు దర్శక, నిర్మాతలు సిద్దం చేస్తున్నారు.

        ఈ సందర్బంగా దర్శకుడు నాగు గవర మాట్లాడుతూ  జర్నలిస్ట్‌గా ఉండి దర్శకుడిగా 
నిరూపించుకోవడానికి మంచి అవకాశమిది.  ఐటీ బ్యాక్‌డ్రాప్‌లో  తెరకెక్కిన ఈ చిత్రం రొటిన్‌ కథలకు భిన్నంగా 
ఉంటుంది. ప్రేక్షకులు కూడా ఈ సినిమా చూసి డిజప్పాయింట్‌ అవరు. ఒక మీనింగ్‌పుల్‌ సినిమా ఇది.  ఈ 
సినిమా చాల బాగా వచ్చింది.తప్పకుండా మీ అందరికి కనెక్ట్‌ అవుతుంది. సెప్టెంబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు 
హిట్‌ సినిమా అవుతుందన్న కాన్ఫిడెన్స్‌ ఉంది అన్నారు. 

          నిర్మాత మథు తొట మాట్లాడుతూ  మా బ్యానర్‌లో తొలి చిత్రం ఇది.  వీకెండ్‌ లవ్‌ లాంటి మంచి 
సినిమాను నిర్మించడం సంతోషంగా ఉంది. దర్శకుడు నాగు ఈ చిత్రాన్ని అధ్బుతంగా తీశారు. క్వాలిటీ  కోసం 
కాంప్రమైజ్‌ కాకుండా సినిమాను నిర్మించాం. ఈ చిత్రం ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అన్నారు.  ఈ సినిమాలో 
సంగీతం శేఖర్‌చంద్ర, కెమెరా జిఎస్‌ రాజ్‌ తదితరులు.

0 comments: