పవన్‌కళ్యాణ్‌కి బాబు స్పెషల్‌ థ్యాంక్స్‌

http://telugu.greatandhra.com/politics/gossip/pawan-ki-babu-special-thanks-53272.html
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయగా, ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్‌కళ్యాణ్‌ హాజరుకావడం టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపింది. చంద్రబాబు తన ప్రసంగంలో పవన్‌కళ్యాణ్‌కి ప్రత్యేకంగా కతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు పవన్‌కళ్యాణ్‌కి చంద్రబాబు స్వయంగా స్వాగతం పలికారు. ఈ క్రమంలో పవన్‌, చంద్రబాబుని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ ` బీజేపీ కూటమి తరఫున పవన్‌కళ్యాణ్‌ ప్రచారం నిర్వహించిన విషయం విదితమే. పవన్‌కళ్యాణ్‌ ప్రచారం తెలంగాణలోనూ తమకు కలిసి వచ్చిందని చంద్రబాబు గతంలోనే చెప్పారు. సీమాంధ్రలో పవన్‌కళ్యాణ్‌ కారణంగా అంచనా వేసుకున్నదానికన్నా ఎక్కువ సీట్లు సాధించామన్నది చంద్రబాబు భావన. అందుకే ఎన్నికల్లో గెలిచిన వెంటనే పవన్‌కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు చంద్రబాబు. ముఖ్యమంత్రిగా తన ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా ప్రత్యేకంగా పవన్‌ని చంద్రబాబు ఆహ్వానించారు కూడా. ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమానికీ పవన్‌కి ఆహ్వానం అందినా, కొన్ని కారణాల వల్ల పవన్‌ ఆ కార్యక్రమానికి హాజరు కాలేదు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి మాత్రం పవన్‌ హాజరు కావడం విశేషమే. - See more at: http://telugu.greatandhra.com/politics/gossip/pawan-ki-babu-special-thanks-53272.html#sthash.mrtk2rGk.dpuf

0 comments: