పవన్ కి నరేంద్ర మోదీ ఓ పొలిటికల్ గిప్ట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి నరేంద్ర మోదీ ఓ పొలిటికల్ గిప్ట్ ను రెడీ చేశాడు.
టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ, పొటికల్ ఫీల్డ్ ను ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా వినిపిస్తుంది.
జనరల్ ఎలక్షన్స్ లో బిజెపి పార్టీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవటమే కాకుండా, తిరుగులేని
మెజారిటీను సాధించుకుంది. ఇదిలా ఉంటే ఎపి నుండి పవన్ కళ్యాణ్ బిజెపి మిత్ర పక్ష కూటమిల
విజయానికి తన వంతుగా సాయం చేశాడు. పవన్ చేసిన సాయాన్ని నరేంద్రమోడీ గుర్తుంచుకొని మరీ,
తనకు ఓ పొలిటికల్ గిప్ట్ ను ఇవ్వాలనుకుంటున్నాడు. దీనికి సంబంధించిన సమాచారాన్ని
ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం గబ్బర్ సింగ్2 మూవీకు
సంబంధించిన పనుల్లో బిజిగా ఉన్నాడు. అయితే పవన్ మాత్రం ఓ వైపు మూవీలను, మరో వైపు
రాజకీయాలను సమర్ధవంతంగా నడపటానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాడు. ఇదిలా ఉంటే నరేంద్ర
మోదీ, పవన్ కళ్యాణ్ కి నేషనల్ స్థాయిలో కీలక పదవిని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడంట. అందుకు
సంబంధించిన రాయబారాన్ని చంద్రబాబు నాయుడి చేత చెప్పించాడని టాక్. అయితే పవన్ మాత్రం
తనకు బిజెపి, అలాగే తెలుగుదేశం పార్టీలో ఎటువంటి పదవులు వద్దని నిస్సంకోచంగా చెప్పుకున్నాడు.
పవన్ కళ్యాణ్ నుండి ఈ విధమైన సమాధానం వస్తుందని నరేంద్రమోదీ ఏ మాత్రం ఊహించలేదని
కూడ టాక్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ అయిదు సంవత్సరాలలో తెలుగుదేశం పార్టి ఇచ్చిన
హామీలను నిజాయితీగా నెరవేర్చాలనీ, లేకుంటే జనసేన పార్టి తీసుకునే నిర్ణయాలకు ఎవరైన ఒక్కటే
అని తన సందేశాన్ని నరేంద్రమోదీకు చెప్పాడంట. ఫిల్మ్ ఇండస్ట్రీ, అలాగే పొలిటికల్ ఫీల్డ్ లోనూ టాప్
సీక్రెట్ గా ఉంటున్న ఈ న్యూస్ ఇప్పుడు బయటకు తెలియడంతో పవన్ కళ్యాణ్ గ్రేట్ నెస్ ని అందరూ
తెగ మెచ్చుకుంటున్నారు. మొత్తంగా పవన్ అనుకున్న సిద్ధాంతాలు ఏ విధమైన ప్రతిఫలాలను
ఇస్తాయో చూడాలని సామాన్య జనాలకీ ఆసక్తిగా మారింది.
0 comments: